Type Here to Get Search Results !

లక్ష్మీనగర్‌లో ఘనంగా నాగ్సాన్‌పల్లి సర్పంచ్‌ కుమారుడి వివాహం వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు.. నూతన దంపతులకు ఆశీర్వాదాలు

 


లక్ష్మీనగర్‌లో ఘనంగా నాగ్సాన్‌పల్లి సర్పంచ్‌ కుమారుడి వివాహం

వివాహ వేడుకకు హాజరైన పలువురు రాజకీయ నాయకులు, బంధువులు

పాపన్నపేట, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్‌): పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లి సర్పంచ్‌ దండెం సుశీల–దుర్గేష్‌ దంపతుల కుమారుడు మహిపాల్‌ వివాహం శుక్రవారం లక్ష్మీనగర్‌లోని ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగింది.

వివాహ వేడుకకు ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్‌ కర్చర్ల నర్సింలుగౌడ్‌, సీనియర్‌ నాయకులు రవీందర్‌ గుప్తాతో పాటు పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, బంధువులు, స్నేహితులు, గ్రామ పెద్దలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

తెలుగు ట్రెండ్స్‌ – రిపోర్టర్‌: పి. శ్రీనివాస్‌, పాపన్నపేట

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language