Type Here to Get Search Results !

రాఖీ వేళ ఆడపడుచులకు చిరు కానుకలు 15వ వార్డులో

 



ఆడపడుచులకు చిరు కానుకలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటింటికీ మిఠాయిల పంపిణీ

అందోలు, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్‌): రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా అందోలు–జోగిపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) 15వ వార్డులోని ఆడపడుచులకు మిఠాయి బాక్సులు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి మిఠాయిలు అందజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని 15వ వార్డులోని ఆడపడుచులకు తనవంతుగా చిరు కానుక అందించాలనే ఉద్దేశంతో మిఠాయి బాక్సులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వారంతా తనకు రక్త సంబంధీకులు కాకపోయినా తోబుట్టువులతో సమానంగా భావిస్తానని, వారితో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రాఖీ పౌర్ణమి సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని ఆడపడుచులందరికీ రక్షాబంధన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language