ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఆవుల రాజిరెడ్డి
నర్సాపూర్ డిపోలో TWU ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ర్యాలీ
నర్సాపూర్, అక్టోబర్ 3 (తెలుగు ట్రెండ్స్): ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ డిపో వద్ద తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU) ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఆవుల రాజిరెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతో పాటు సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అక్టోబర్ 9న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి TWUను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో TWU నాయకులు ఎం.ఆర్.కే. రావు, శాఖయ్య, సంగమేశ్వర్, సౌజన్య, డిపో నాయకులు వెంకట్గౌడ్, నాగరాజు, శేఖర్, ప్రేమ్, ఇస్మాయిల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, కాంగ్రెస్ నాయకులు రవిశంకర్, రవి తదితరులతో పాటు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నా
రు.

