Type Here to Get Search Results !

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు భూగర్భ జలాల పరిరక్షణకు ప్రాధాన్యత: కలెక్టర్ ప్రతిమా సింగ్

 



ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే భూగర్భ జలాలను పరిరక్షించాలి

వీబీ–జీ రామ్ జీ పథకం పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

పాపన్నపేట, అక్టోబర్ 17 (తెలుగు ట్రెండ్స్):

ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి కొరతను ఎదుర్కొనేందుకు భూగర్భ జలాల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వీబీ–జీ రామ్ జీ పథకం కింద చేపడుతున్న ఉపాధి హామీ పనులను శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టి, అవసరమైన సమయంలో పంటల సాగుకు వినియోగించుకునేలా ఫామ్ పాండ్లు, సామూహిక ఇంకుడు గుంతలు, జలసిరి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఫామ్ పాండ్ల నిర్మాణ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రతి మండలంలో, ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు ఫామ్ పాండ్ల చొప్పున ఎంపిక చేసి, వాటి నిర్మాణ పనులను క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. పనులకు ప్రతిరోజూ ఎంతమంది కూలీలు హాజరవుతున్నారు, వారికి ఎంత మేర కూలి చెల్లిస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరును తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.

గ్రామాల్లో భూగర్భ జలమట్టాల పెంపు, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వీబీ–జీ రామ్ జీ పథకం కింద అవసరమైన పనులను గుర్తించి చేపట్టాలని కలెక్టర్ సూచించారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నీటి సంరక్షణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో విష్ణువర్ధన్ రెడ్డి, తహసీల్దార్ సతీష్, సర్పంచ్ కుమ్మరి జగన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language