చిన్న గణపురంలో అభివృద్ధి పనుల ప్రారంభానికి ఆవుల రాజిరెడ్డి రాక
నూతన బస్ షెల్టర్ ప్రారంభం.. ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించనున్న నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్
తెలుగు ట్రెండ్స్, కొల్చారం, అక్టోబర్ 15: మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్న గణపురం గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అక్టోబర్ 16న మధ్యాహ్నం 12 గంటలకు గ్రామానికి రానున్నారు.
రాజన్న సహకారంతో మంజూరైన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. అలాగే తన సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను స్థానిక సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని కూడా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రాజిరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ నాగుల కోరారు.
