Type Here to Get Search Results !

కొత్త లింగాయిపల్లిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం

 


కొత్త లింగాయిపల్లిలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.. అద్వేత జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, అక్టోబర్ 15: మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కొత్త లింగాయిపల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామస్థులు భక్తితో తరలివచ్చారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొత్త విశాంత్ గుప్తా కుమార్తె అద్వేత జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారి అద్వేత ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కుటుంబ సభ్యులు అమ్మవారిని ప్రార్థించారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language