Type Here to Get Search Results !

అందోలు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మండల, టౌన్‌ అధ్యక్షుల నియామకం నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

 *అందోలు నియోజకవర్గ మండలాల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ*

*నియామక పత్రాలను అందజేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ 

*తెలుగు ట్రెండ్స్, అందోలు:*

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు అందోలు నియోజకవర్గం లోని అన్ని  మండలాలతో పాటు అందోలు - జోగిపేట టౌన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

*నూతన అధ్యక్షులు వీరే..*

అందోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా (గంగాధర్ అశోక్), మునిపల్లి మండల అధ్యక్షులుగా (లింగన్న గారి సతీష్ కుమార్), చౌటకూర్ మండల అధ్యక్షులుగా (బోడపట్ల గణేష్), పుల్కల్ మండల అధ్యక్షులుగా (మల్లన్న గారి దుర్గారెడ్డి), రాయికోడ్ మండల అధ్యక్షులుగా (పట్లోళ్ల కేదారినాథ్), వట్టిపల్లి మండల అధ్యక్షులుగా (వజినాల విశ్వాస్), అందోల్ - జోగిపేట టౌన్ అధ్యక్షులుగా (డిజీ. వెంకటేశం), రేగోడ్ మండల అధ్యక్షులుగా (దిగంబర రావు), అల్లాదుర్గ్ మండల అధ్యక్షులుగా (కొప్పుల శేషారెడ్డి), టేక్మాల్ మండల అధ్యక్షులుగా (పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి) లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మండల, టౌన్ అధ్యక్షులుగా నియమితులైన పార్టీ నాయకులతో మంత్రి  దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేసిన మంత్రి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language