Type Here to Get Search Results !

పాపన్నపేటలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 


పాపన్నపేటలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ డీలర్లపై చర్యలు: జిల్లా వ్యవసాయ అధికారి

పాపన్నపేట, అక్టోబర్ 22 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి కే. దేవ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి పి. శ్రీనివాస్ రాజు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎరువుల దుకాణాల్లోని రిజిస్టర్లు, గోదాములను అధికారులు పరిశీలించారు. ఎరువుల నిల్వలు, విక్రయాల వివరాలు, రికార్డుల నిర్వహణపై తనిఖీలు చేపట్టారు. ఎరువుల విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీలర్లకు సూచించారు.

ఎరువులను తప్పనిసరిగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ (FFS) యాప్‌ ద్వారానే విక్రయించాలని, విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల విక్రయాలు చేపట్టరాదని హెచ్చరించారు. వరి విత్తనాల విక్రయాల విషయంలోనూ సంబంధిత నిబంధనలను పాటించాలని సూచించారు.

ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత లైసెన్స్‌దారులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతులకు ఎరువులు సక్రమంగా అందేలా, విక్రయాల్లో పారదర్శకత ఉండేలా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ శాఖ ఏఈఓలు అసిఫ్, సంతోష్ కుమార్, డీలర్ ఆర్. రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ న్యూస్ | telugutrendsnews.com

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language