Type Here to Get Search Results !

వెంకటాపూర్‌లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

 



వెంకటాపూర్‌లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రామాయంపేట, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ మంజూరు (ప్రొసీడింగ్) పత్రాలను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు నూతన గ్రామపంచాయతీ భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు నేరుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనురాధ నరేష్, కేంగర్ల రేణుక గట్టయ్య, తాడే హరీష్, పూర్ర స్వామి, కొమ్మగళ్ల కవిత చిరంజీవి, కీసరి నాగరాణి రాజా గౌడ్, రాచపల్లి ఎల్లయ్య, కొమ్మగళ్ల అక్షిత సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గజవాడ నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language