Type Here to Get Search Results !

చిన్న ఘనపూర్ సొసైటీలో రేపు మహాజన సభ

 

చిన్న ఘనపూర్‌లో రేపు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ

రైతులు, సంఘం పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు హాజరుకావాలని అధ్యక్షుడు మంద నాగయ్య విజ్ఞప్తి

చిన్న ఘనపూర్, అక్టోబర్ 10 (తెలుగు ట్రెండ్స్):

చిన్న ఘనపూర్ గ్రామ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకు సొసైటీ ఆవరణలో మహాజన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి సంఘం అధ్యక్షుడు మంద నాగయ్య సభ్యులకు, రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, సొసైటీ పరిధిలోని రైతులు, గ్రామ పెద్దలు, యువకులు, ఇతర గ్రామస్తులు సభకు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. అందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ సహకార సంఘం కార్యకలాపాల్లో రైతుల భాగస్వామ్యం కీలకమని, సంఘానికి సంబంధించిన కార్యక్రమాల్లో సభ్యులు చురుకుగా పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language