Type Here to Get Search Results !

పొడ్చన్‌పల్లి తండాలో వ్యక్తి ఆత్మహత్య

 


పొడ్చన్‌పల్లి తండాలో వ్యక్తి ఆత్మహత్య

పాపన్నపేట, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి తండాలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన పాల్త్య అంబ్రియా (68) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం మద్యం దుకాణం వద్ద ఉన్న అంబ్రియాను కుటుంబ సభ్యులు ఇంటికి రావాలని కోరగా వస్తానని చెప్పినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. సోమవారం ఉదయం తండా సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో అంబ్రియా కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language