Type Here to Get Search Results !

ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ కార్మిక సంఘం జయకేతనం


 ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ కార్మిక సంఘం ఘన విజయం


నర్సాపూర్ డిపోలో 108 ఓట్లకు 100 ఓట్లు.. రాష్ట్రస్థాయి ఎన్నికల్లో 105 ఓట్లు


నర్సాపూర్, అక్టోబర్ 09 (తెలుగు ట్రెండ్స్):


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ కార్మిక సంఘం విజయాన్ని సాధించింది. నర్సాపూర్ బస్సు నిలయంలో జరిగిన నిలయ కార్యదర్శి ఎన్నికలో మొత్తం 108 ఓట్లకు గాను తెలంగాణ కార్మిక సంఘానికి 100 ఓట్లు లభించాయి. దీంతో భారీ ఆధిక్యంతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.


అదేవిధంగా రాష్ట్రస్థాయి ఎన్నికల్లోనూ మొత్తం 108 ఓట్లకు గాను తెలంగాణ కార్మిక సంఘానికి 105 ఓట్లు లభించాయి. ఈ ఫలితాలతో సంఘం నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.


ఈ సందర్భంగా నర్సాపూర్ నిలయ తెలంగాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి, సంఘం ప్రతినిధులను, నిలయ కార్యదర్శిగా ఎన్నికైన వెంకట్ గౌడ్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి సంఘం నాయకులు నిరంతరం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.


ఈ విజయం కార్మికుల నమ్మకానికి, ఐక్యతకు నిదర్శనమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language