Type Here to Get Search Results !

పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

 


పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను పేర్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే

తెలుగు ట్రెండ్స్, శివ్వంపేట:

పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని, ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ పండుగ అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శివ్వంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, మహిళల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు.

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల వేడుకల్లో ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి, ఆటపాటలతో పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ప్రకృతిని పూల రూపంలో దేవతగా పూజించే సంప్రదాయం తెలంగాణ ప్రత్యేకత అని, బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవాన్ని, ఐక్యతను, ప్రకృతి పట్ల ప్రేమను చాటిచెబుతుందని కొనియాడారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించి, రాష్ట్ర పండుగగా గుర్తించారని ఆమె గుర్తుచేశారు. ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా రాష్ట్రంలోని ఆడపడుచులకు చీరలను పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

గోమారం గ్రామంలో బతుకమ్మ వేడుకలు ప్రజల భాగస్వామ్యంతో సందడిగా సాగాయి. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వాకిటి హనుమంతరెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, వాకిటి బిక్షపతి రెడ్డి, కుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language