Type Here to Get Search Results !

చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణం: పోలీసులు




 

చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసానికి కోతులే కారణం

సీసీ కెమెరాల దృశ్యాల పరిశీలనతో నిర్ధారణ

ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాల సేకరణ: మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్

ప్రత్యక్ష సాక్షి 

తెలుగు ట్రెండ్స్ | మెదక్, అక్టోబర్ 13:

మెదక్ పట్టణంలోని వెల్‌కమ్ బోర్డు వద్ద ఉన్న సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణమని విచారణలో వెల్లడైనట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో కోతులు విగ్రహాన్ని పట్టుకొని ఊగడం వల్ల అది దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు.

విగ్రహం దెబ్బతిన్న విషయం పోలీసుల దృష్టికి వచ్చిన వెంటనే ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించి పరిశీలించినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు మహిళల నుంచి వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలను పరిశీలించిన అనంతరం కోతుల కారణంగానే విగ్రహం దెబ్బతిన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ స్పష్టం చేశారు.

విగ్రహం దెబ్బతిన్న ఘటనపై వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెల్లడైందని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language