Type Here to Get Search Results !

మోదీ జన్మదిన వేడుకల్లో సేవా సంకల్ప అభియాన్ చిన్న ఘనపూర్‌లో అంగన్వాడీ మేళా.. చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై అవగాహన


 మోదీ జన్మదినం సందర్భంగా చిన్న ఘనపూర్‌లో సేవా సంకల్ప అభియాన్


చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషణపై అవగాహన కార్యక్రమం


కొల్చారం, అక్టోబర్‌ 3 (తెలుగు ట్రెండ్స్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ కొల్చారం మండల అధ్యక్షుడు ఘనపూర్ హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పటోళ్ల మల్లిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మేళా నిర్వహించి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. చిన్నారులకు అందించే పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, ప్రాథమిక విద్య తదితర అంశాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కీలకంగా పనిచేస్తున్నాయని కార్యక్రమంలో వివరించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మహేష్, గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి రవికాంత్‌తో పాటు యువ నాయకులు నరేష్, నాగరాజు, రమేష్, రంజిత్, మధు, అరుణ్, సాయి కృష్ణ, వేణు, రాజేష్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language