Type Here to Get Search Results !

జీఓ 25ను తక్షణమే రద్దు చేయాలి.. ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలి: ఎస్జీటీయూ

 జీఓ నం.25ను తక్షణమే రద్దు చేయాలి


ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలి.. ఇద్దరు టీచర్లతో ఐదు తరగతులా?: ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం

వెల్దుర్తి మండలం, అక్టోబర్‌ 2 (తెలుగు ట్రెండ్స్): విద్యా బోధనలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీఓ నంబర్‌ 25ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం డిమాండ్‌ చేశారు. ప్రాథమిక విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని కోరుతూ ఎస్జీటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌తో పాటు అధికార పార్టీ నాయకులకు సంఘం బాధ్యులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అరికెల వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల నాణ్యమైన విద్యాబోధన అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కొత్త విధానాల అమలు కారణంగా ప్రాథమిక పాఠశాలల మనుగడపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉపాధ్యాయులపై పనిభారం, ఒత్తిడి పెరుగుతుండగా, మరోవైపు విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అందించడం సవాలుగా మారుతోందన్నారు. 20 నుంచి 60 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులతో ఐదు తరగతులను నిర్వహించడం శాస్త్రీయ విధానం కాదని పేర్కొన్నారు. ఒకే సమయంలో వేర్వేరు తరగతులకు చెందిన విద్యార్థులకు బోధన అందించాల్సి రావడంతో ఉపాధ్యాయులపై అదనపు భారం పడటంతో పాటు విద్యార్థులకు కూడా అవసరమైన స్థాయిలో బోధన అందించే అవకాశం తగ్గుతుందని తెలిపారు. విద్యారంగంలో కొత్త విధానాలు, మార్పులు తీసుకువచ్చే ముందు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వెంకటేశం కోరారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు పాఠశాలల్లో అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియమించాలని, ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జీఓ నంబర్‌ 25ను తక్షణమే రద్దు చేసి ప్రాథమిక పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరా




రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language