Type Here to Get Search Results !

మెదక్ జిల్లా కొల్చారంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్‌!

 


మెదక్ జిల్లా కొల్చారంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

ముగ్గురు అరెస్ట్‌.. రూ.17,300 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

మెదక్, అక్టోబర్ 13: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి గ్రామంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17,300 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కొల్చారం గ్రామానికి చెందిన సత్యనారాయణ, శేఖర్, నర్సింలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు  మాట్లాడుతూ.. జిల్లాలో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామాల్లో పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language