నిరుపేద కుటుంబానికి అండగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామానికి చెందిన జెగ్గ పౌలు (70) అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అండగా నిలిచారు. పౌలు మృతి చెందిన విషయం గ్రామ బీఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న తిరుపతిరెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థికసాయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ నాయకులు పి. ఏసు, జె. సంజీవ్, జె. డానియల్, పి. యేసు కుమార్, దావీదు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
