*అందరూ ఆనందోత్సవాల మధ్య పండుగలను జరుపుకోవాలి*
*కాంగ్రెస్ నేత సురోత్తం రెడ్డి
*300 మంది యువకులకు నూతన వస్త్రాల పంపిణీ
*తెలుగు ట్రెండ్స్, అందోలు
-(చాపల సత్యం):*
పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమని, రాబోయే పండుగలను అందరూ సంతోషకరమైన వాతావరణంలో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ బిల్డర్ పట్లోళ్ల సురోత్తం రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం అందోలు నియోజకవర్గ జోగిపేట పట్టణంలో 300 మంది యువకులకు దసరా కానుకగా బట్టలను పంపిణీ చేశారు. ఈ బట్టల పంపిణీలో మరో వ్యాపారవేత్త సార శివకుమార్ సైతం భాగస్వామ్యులయ్యారు. ఇదిలా ఉండగా దసరా కానుకగా యువకులకు బట్టలను అందించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసేలా వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని పలువురు వారిని దీవిస్తున్నారు.

