మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు
2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
తెలుగు ట్రెండ్స్ న్యూస్, మెదక్, అక్టోబర్ 17:
మెదక్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ (DMLT), డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ (DMAT) తదితర పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రకటన జారీ చేసినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనల కోసం తెలంగాణ పారామెడికల్ బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
వెబ్సైట్: www.tgpmb.telangana.gov.in
ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్లో పేర్కొన్న సంప్రదింపు నంబర్ 9666935777 ను సంప్రదించవచ్చు.
తెలుగు ట్రెండ్స్ న్యూస్
