Type Here to Get Search Results !

ఎనిమిది మందికి రూ.1.80 లక్షల సీఎంఆర్ చెక్కుల పంపిణీ

 




నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కొల్చారం, అక్టోబర్ 6 (తెలుగు ట్రెండ్స్): నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎనిమిది మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,80,000 విలువైన సీఎంఆర్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థికసాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే సాయం కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో సీఎంఆర్ చెక్కులు మంజూరు కావడంతో లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అందిన ఆర్థికసాయం వైద్య ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొల్చారం గ్రామ సర్పంచ్ దేవనగారి శేఖర్, చిన్నఘనపూర్ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, అప్పాజీపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్, మండల పార్టీ జనరల్ సెక్రటరీ గంగసాని మహేశ్వర్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండా కృష్ణ, రంగంపేట సొసైటీ డైరెక్టర్ రమేష్, కిష్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం, తుక్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాములు, కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు నవీన్, మాజీ సర్పంచ్ ఆశన్న, శ్రీశైలం నాయకులు భాస్కర్, శ్రవణ్, రవి, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవనగారి శ్రావణ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language