Type Here to Get Search Results !

పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్‌ కోసం.. చలో హైదరాబాద్‌: అనంతరావు

 

చలో హైదరాబాద్‌.. ఎల్బీ స్టేడియంకు ఉద్యోగులు, పెన్షనర్లు

పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్‌ అమలు, పెండింగ్‌ బకాయిల చెల్లింపుపై జేఏసీ ధర్నా

మెదక్‌, సెప్టెంబర్‌ 8 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు, పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మెదక్‌ జిల్లా ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం కార్యదర్శి బచ్చోళ్ల అనంతరావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఆర్సీ, డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన అనంతరం వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అనంతరావు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో మెదక్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language