Type Here to Get Search Results !

అప్పాజీపల్లిలో ఆధ్యాత్మిక శోభ.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఘనంగా అభిషేకం కొల్చారం మండలం అప్పాజీపల్లిలో శ్రావణమాస పూజలు.. భక్తిశ్రద్ధలతో అన్నదానం

 అప్పాజీపల్లిలో ఆధ్యాత్మిక శోభ.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఘనంగా అభిషేకం


కొల్చారం మండలం అప్పాజీపల్లిలో శ్రావణమాస పూజలు.. భక్తిశ్రద్ధలతో అన్నదానం


కొల్చారం, తెలుగు ట్రేండ్స్సెన్యూస్ సెప్టెంబర్ 5: శ్రావణమాసాన్ని పురస్కరించుకుని కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.


ప్రతి సంవత్సరం నిర్వహించే ఆనవాయితీలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్, ఉపసర్పంచ్ చలం నర్సింలు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతల భాగయ్య, సదాల తిరుపతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా భజన భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భజన కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్థులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. “ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః” అంటూ భక్తులు స్వామివారిని స్మరించారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language