యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎమ్మెల్యే సునీత రెడ్డి
ఎన్నికల సమయంలో యువతకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా యువతను నిలువునా మోసం చేసిందని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో బి ఆర్ ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం యువత సమరభేరి కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులు బారి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చిల్డ్రన్ పార్క్ నుంచి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన రోడ్డు గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అంబేద్కర్ చౌరస్తాలో సమావేశంలో. ముందుగా యువకులు, విద్యార్థు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేద వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సరూర్ నగర్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకులు యువతకు ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను యువతకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి యువతీ, యువకులకు నెలకు 4 వేలు తో పాటు విద్యార్థులకు 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్, స్కాలర్షిప్ వంటి ఎన్నో హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బలోపెతం అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నిర్వీర్యపరుస్తుందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం జరిగే విధంగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లేకుంటే పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నహీముద్దీన్ మాజీ జెడ్పిటిసి బాబ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, రమణ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు స్రవంతి కరుణాకర్, తుల్జమ్మ బిక్షపతి, రాములు నాయక్, యువకులు విద్యార్థులు పాల్గొన్నారు.
