Type Here to Get Search Results !

డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు.. వైద్య అవగాహనపై అభినందనలు

 


డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్‌ను కలిసిన నాయకులు

సోషల్ మీడియా ద్వారా వైద్య అవగాహన కల్పించడంపై అభినందనలు

మనోహరాబాద్, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
ప్రముఖ నరాల నిపుణులు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వైద్య అవగాహన కల్పిస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ను మనోహరాబాద్ మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మండల బీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్ సింగ్ ఠాగూర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, అభిమానులు డాక్టర్ విక్రాంత్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యపరమైన విషయాలపై అవగాహన పెంచడంలో ఆయన అందిస్తున్న సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా సోషల్ మీడియా ద్వారా అందిస్తున్న వైద్య అవగాహన, సమాచారంతో ప్రేరణ కలుగుతోందని ఈ సందర్భంగా డాక్టర్ విక్రాంత్‌కు నాయకులు తెలిపారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆరోగ్య విషయాలను వివరించడం వల్ల అనేక మందికి ఉపయోగం కలుగుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్‌ను నాయకులు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మరింత విస్తృతంగా వైద్య అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్ సింగ్ ఠాగూర్, సోను సింగ్తో పాటు పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language