Type Here to Get Search Results !

పాపన్నపేట పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

 



విధి నిర్వహణలో పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

పాపన్నపేట ఎస్సై సారా శ్రీనివాస్‌గౌడ్‌

పాపన్నపేట, సెప్టెంబర్ 13 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పాపన్నపేట ఎస్సై సారా శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. 1999 సెప్టెంబర్‌ 13న పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌పై జరిగిన నక్సల్స్‌ దాడిలో వీరమరణం పొందిన పోలీసులను స్మరించుకుంటూ ఆదివారం పోలీస్‌స్టేషన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

1999లో జరిగిన ఈ దాడిలో హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునందన్‌తో పాటు కానిస్టేబుళ్లు అబిద్‌ హుస్సేన్‌, ప్రసాద్‌, నర్సింలు, రాంచందర్‌ ప్రాణాలు కోల్పోయారు. వారి సేవలను స్మరించుకుంటూ పోలీస్‌ అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎస్సై సారా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. నాటి ఘటనలో ఐదుగురు పోలీసులు వీరమరణం పొందడం బాధాకరమని పేర్కొన్నారు. వారి త్యాగాలు నేటి పోలీసు సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి త్యాగాలను భావితరాలకు గుర్తుండేలా స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. దేశం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులకు ఘన నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్సై తుక్కయ్య, కానిస్టేబుళ్లు అనిల్‌, నాగలక్ష్మి, పోలీసు సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language