Type Here to Get Search Results !

పాపన్నపేట ప్రభుత్వ పాఠశాలకు భూమి పూజ మన్నె ఈశ్వరయ్య, శాంతమ్మ జ్ఞాపకార్థం నిర్మాణం

 పాపన్నపేట ప్రభుత్వ పాఠశాలకు భూమి పూజ


కీర్తిశేషులు మన్నె ఈశ్వరయ్య, మన్నె శాంతమ్మ జ్ఞాపకార్థం పాఠశాల నిర్మాణానికి ఆర్థిక సహకారం


పాపన్నపేట, సెప్టెంబర్ 6 (తెలుగు ట్రెండ్స్):

మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత కీర్తిశేషులు మన్నె ఈశ్వరయ్య, మన్నె శాంతమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న పాఠశాల భవనానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు.


మన్నె ఈశ్వరయ్య, మన్నె శాంతమ్మల జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో వారి కుమారుడు డాక్టర్ ఉపేందర్ మన్నె, కోడలు వందన మన్నె ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ముందుకు రావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ నిర్మాణం పాఠశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని పలువురు పేర్కొన్నారు.


ఆదివారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంపేట నరేందర్ గౌడ్, మల్లంపేట మాజీ సర్పంచ్ బాపురెడ్డి, ఉపసర్పంచ్ సద్దాం, మాజీ ఉపసర్పంచ్ ఖలీమ్, పాఠశాల చైర్మన్ శ్రీరాం భవాని, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోద, పాఠశాల సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.


అలాగే ఎల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు జయవర్ధన్, శ్రీమన్నె ఈశ్వరయ్య, మన్నె ఈశ్వరయ్య–మన్నె శాంతమ్మ ట్రస్ట్ సభ్యులు కైలాస రాజేశ్వర్ గుప్తా, నాయకులు దోసని సంగమేశ్వర, క్యాసగళ్ల ప్రవీణ్ గౌడ్, కుర్తివాడ ప్రసాద్ గౌడ్, సుంకరి కిష్టయ్య, ముశెట్టి కిష్టయ్య, పూర్వ అధ్యాపకులు టప్ప రాములు, గ్రామ ప్రజలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి వ్యక్తిగతంగా ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. పాఠశాల భవన నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




కీర్తిశేషులు మన్నె ఈశ్వరయ్య, మన్నె శాంతమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి సహకరించడం ద్వారా విద్యాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారని గ్రామస్తులు అభినందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language