Type Here to Get Search Results !

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శ.. కుటుంబ సభ్యులకు ఓదార్పు

 *నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి*


*చిలిపిచెడ్, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్ న్యూస్):*


మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పరిధిలోని బండాపోతుగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ హుస్సేన్ మాతృమూర్తి ఖాజాబీ బేగం (87) అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.


ఖాజాబీ బేగం మృతి వార్త తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హుటాహుటిన బండాపోతుగల్ గ్రామానికి చేరుకున్నారు. ఆమె పార్థివదేహంనికిఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రద్ధాంజలి ఘటించారు.


తరువాత శోకసంద్రంలో మునిగిపోయిన కుమారుడు సయ్యద్ హుస్సేన్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖాజాబీ బేగం మృతికి గల కారణాలను, గత కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ తీరని విషాద సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థించారు.


అదేవిధంగా ఫైజాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రామస్వామి సుధాకర్ గౌడ్ మాతృమూర్తి రుక్కమ్మ ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారని తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.


ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల నాయకులు సారా రామాగౌడ్, సంగా గౌడ్, మధుసూదన్ రెడ్డి, ఎంసీ విట్టల్, నర్సింహారెడ్డి, షఫీ, దుర్గారెడ్డి, గోపాల్ రెడ్డి, యాదగిరి, గోపాల్ రావు, మల్లారెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సయ్యద్ హుస్సేన్ కుటుంబాన్ని పరామర్శించారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language