Type Here to Get Search Results !

భువనగిరి జిల్లా గ్రంథాలయంలో ఘనంగా కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు

 

జిల్లా గ్రంథాలయంలో ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జ

యంతి వేడుకలు

తెలంగాణ భాషా వికాసానికి, ప్రజా చైతన్యానికి కాళోజీ సేవలు చిరస్మరణీయం

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్‌ 9 (తెలుగు ట్రెండ్స్‌): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవేజ్‌ ఉర్‌ రహమాన్‌ చిస్తీ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ సాహిత్య సేవలను, తెలంగాణ భాష, సంస్కృతి కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ భాషా వికాసానికి, ప్రజా చైతన్యానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తన అక్షరాలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన కాళోజీ, అన్యాయాన్ని ఎదిరిస్తూ ప్రజల పక్షాన నిలిచారని పేర్కొన్నారు. ఆయన రచనలు, కవితలు, నినాదాలు నేటికీ సమాజానికి స్ఫూర్తిని అందిస్తున్నాయని తెలిపారు.

కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పోత్నక్‌ ప్రమోద్‌ మాట్లాడుతూ.. నిజాం వ్యతిరేక పోరాటంతో పాటు గ్రంథాలయ ఉద్యమంలో కాళోజీ నారాయణరావు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణలో ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

యువత కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని, తెలంగాణ భాష, యాస, సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, జిల్లా గ్రంథాలయ అధికారులు, సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language