Type Here to Get Search Results !

మంజీరా వాగులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

 



మంజీరా వాగులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

గాలింపు చర్యల్లో మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసి దర్యాప్తు

కొల్చారం మండలం, సెప్టెంబర్ 15 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
మంజీరా నది వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన కొల్చారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనాపూర్ గ్రామానికి చెందిన చాకలి బిక్షపతి (40), తండ్రి కిష్టయ్య, వ్యవసాయ పనులతో పాటు చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ నెల 13న సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో బిక్షపతి చేపలు పట్టేందుకు కోనాపూర్ గ్రామ శివారులోని మంజీరా నది వాగు వద్దకు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం కుటుంబ సభ్యులు, స్థానికుల ద్వారా మెదక్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల నుంచి మంజీరా వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు సాయంత్రం 4.50 గంటల సమయంలో బిక్షపతి మృతదేహం గాలింపు చర్యల్లో లభ్యమైంది. మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీసుకువచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మంజీరా వాగులో మునిగిపోవడం వల్లే బిక్షపతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య చాకలి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్‌ఐ పి. శ్రీ మోహియుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాద ఘటనతో కోనాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన నేపథ్యంలో నదులు, వాగుల్లో చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language