Type Here to Get Search Results !

చలో అసెంబ్లీకి బ్రేక్.. తూప్రాన్‌లో లంబాడి నాయకుల ముందస్తు అరెస్టు


 

లంబాడి నాయకుల ముందస్తు అరెస్టు

చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో తూప్రాన్‌లో పోలీసుల చర్య

తూప్రాన్, సెప్టెంబర్ 11 (తెలుగు ట్రెండ్స్):
లంబాడీల హక్కుల కోసం నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లంబాడి నాయకులను పోలీసులు శుక్రవారం ఉదయం ముందస్తుగా అరెస్టు చేశారు. గిరిజన విద్యార్థి సంఘం పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

తూప్రాన్ మున్సిపల్ నాలుగో వార్డు కౌన్సిలర్, లంబాడి ఐక్యవేదిక మెదక్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జైపాల్ నాయక్ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు దిగావత్ శివ నాయక్ తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

లంబాడీల హక్కుల కోసం పలు డిమాండ్లతో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. ముఖ్యంగా సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని అడవిలో కాకుండా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను విడుదల చేయాలని, గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. లంబాడి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంపై వారి అనుచరులు, గిరిజన సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

లంబాడీ సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, తమ డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language