వెల్దుర్తి, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):
వెల్దుర్తి మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు కృష్ణ (50) అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ అనంతరం ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కృష్ణ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో గొడవపడిన అనంతరం బొడ్డు కృష్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కృష్ణ కుమారుడు దుర్గాప్రసాద్ వెల్దుర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కుమారుడి ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన కృష్ణ ఆచూకీ కోసం పోలీసులు వివరాలు సేకరిస్తూ వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ కర్ణాకర్రెడ్డి తెలిపారు.
ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
బొడ్డు కృష్ణ ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే వెల్దుర్తి పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్ఐ కర్ణాకర్రెడ్డి కోరారు. సమాచారం తెలిసిన వారు 8712657890 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని
సూచించారు.
