Type Here to Get Search Results !

కొంపల్లిలో రోడ్డుపై యువకుడి హల్‌చల్.. మద్యం మత్తులో పడి ఉన్న వైనం

 


మద్యం మత్తులో రోడ్డుపై పడుకున్న యువకుడు

కొంపల్లి, సెప్టెంబర్ 22 (తెలుగు ట్రెండ్స్):
కొంపల్లిలోని సురక్ష హాస్పిటల్‌ ఎదుట సోమవారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై పడుకోవడం కలకలం రేపింది. మద్యం సేవించి మత్తులో ఉన్న యువకుడు రహదారిపై పడిపోవడంతో కొంతసేపు అక్కడే ఉండిపోయాడు.

రాత్రి వేళ రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై యువకుడు పడుకుని ఉండటంతో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రహదారిపై ఇలాంటి ఘటనలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు.

మద్యం సేవించి రోడ్లపైకి వచ్చే వారు, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన రహదారులపై రాత్రి వేళల్లో పర్యవేక్షణ పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language