Type Here to Get Search Results !

🕉️ వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం మండపాల ఏర్పాటు, నిమజ్జనంపై కీలక చర్చ.. పాల్గొన్న ఎస్సై, ప్రజాప్రతినిధులు

 


వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష..!

మండపాల ఏర్పాటు, నిమజ్జనంపై గ్రామస్థులతో చర్చించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

కొల్చారం మండలం:
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్ చందాపురం మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

వినాయక చవితి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేయనున్న మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో భద్రతా చర్యలు, రవాణా, విద్యుత్‌ తదితర అంశాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చారం మండల ఎస్సై మహమ్మద్ హాజరై వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. నిమజ్జనం సమయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.

గ్రామంలో వినాయక చవితి వేడుకలను ఐక్యత, భక్తి భావంతో నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చర్చించారు.

ఈ సమావేశంలో కానిస్టేబుల్ మహేష్, ఉపసర్పంచ్ అంకమ్మ నర్సింలు, పీఏసీఎస్‌ చైర్మన్ మంద నాగయ్య, వార్డు సభ్యులు గడ్డం రాజు, జింకి వినీత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గాజుబోయిన అశోక్, బీఆర్ఎస్ నాయకులు పుల్లబోయిన మల్లేశం, బొబ్బిలి సందీప్ కుమార్, నాగం రమేష్, నాయికోటి రమేష్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language