పాపన్నపేట మండలం నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు
కాంగ్రెస్కు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరిక
మెదక్, సెప్టెంబర్ 11 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు.
పాపన్నపేట మండలంలోని సీతానగర్ గ్రామ కాంగ్రెస్ వార్డు మెంబర్తో పాటు నార్సింగి, ఆర్కెల, నాగ్సన్పల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారికి నాయకులు బీజేపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీకి వస్తున్న స్పందన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.
బీజేపీలో చేరిన కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలను ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బీకొండ రాములు, నాయకులు ఆకుల సుధాకర్, తలారి దుర్గయ్య, బీజేవైఎం నాయకులు, నార్సింగి ఉపసర్పంచ్ శ్రీరామ్ నరేష్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రన్న, బీజేవైఎం జిల్లా నాయకుడు సతీష్ కుమార్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు ముమ్మని సిద్ధిరాములు, పాపన్నపేట పట్టణ అధ్యక్షుడు సుంకరి కిష్టయ్య, జిల్లా మైనార్టీ మోర్చా కమిటీ ప్రధాన కార్యదర్శి బుల్లెట్, మండల మాజీ జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు వెంకట్, సాయిబాబా రాజు, రామచందర్, నాగరాజు, గోపాల్, మల్లేశం, సాయిలు, దుర్గయ్య, కుమార్, శంకర్ గౌడ్, చక్రపాణి, ఏసు, పోచయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల చేరిక కార్యక్రమానికి దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్కు తరలివెళ్లారు.

