Type Here to Get Search Results !

రెండేళ్లుగా జీతాల్లేక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అవస్థలు.. కొనసాగింపు ఉత్తర్వుల కోసం వేడుకోలు

 రెండేళ్లుగా జీతాల్లేక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు


కొనసాగింపు ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు.. ప్రజాప్రతినిధులు స్పందించాలని వేడుకోలు


మెదక్, జూలై 18 (తెలుగు ట్రేండ్స్):

రెండేళ్లుగా జీతాలు లేక.. విధుల్లో కొనసాగింపు ఉత్తర్వులు లేక.. కుటుంబాలను పోషించేందుకు నానా అవస్థలు పడుతున్నామని మెదక్ అగ్నిమాపక శాఖలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసిన స్వీపర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలో పనిచేసిన తమకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


మెదక్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేసిన తమకు 2024 నుంచి ఇప్పటివరకు కొనసాగింపు ఉత్తర్వులు రాలేదని ఉద్యోగులు తెలిపారు. దీంతో విధుల్లో కొనసాగలేక, జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. కుటుంబ పోషణ కోసం ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.


“పని చేసినా జీతాలు లేవు.. కొనసాగింపు ఉత్తర్వులు లేవు.. మా పరిస్థితి ఏంటి?” అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తాము పనిచేసిన కాలానికి సంబంధించిన కొన్ని నెలల జీతాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తమ పాత బిల్లులు చెల్లించేందుకు కూడా సంబంధిత ఉత్తర్వులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.


తమ సమస్యపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులను సంప్రదించగా, తెలంగాణ ఆర్థిక శాఖ నుంచి కంటిన్యూషన్‌ ఆర్డర్లు రాలేదని సమాధానం ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నామని అన్నారు.


తాము పేద కుటుంబాలకు చెందిన వారమని, తమకు ఉన్న ఏకైక ఆధారం ఈ ఉద్యోగమేనని వారు తెలిపారు. “కుటుంబాలను ఎలా పోషించాలి.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు ఎలా భరించాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకోవడంతో పాటు పెండింగ్‌ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు తమ గోడును పట్టించుకుని తక్షణమే పరిష్కారం చూపాలని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేస్తే వెంటనే విధుల్లో చేరి తమ బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language