Type Here to Get Search Results !

వరి పంటపై రైతులకు అవగాహన.. పోతిరెడ్డిపల్లిలో పొలం బడి కార్యక్రమం

 



వరి పొలంలో పొలం బడి.. రైతులకు పంట తెగుళ్లు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

కొల్చరం , సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా కౌల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో రైతు పొలంలో శుక్రవారం పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరి పంటలో ప్రస్తుతం కనిపిస్తున్న కంకి నాలి, బ్రౌన్ ప్లాంట్ హాపర్ (బీపీఎచ్), అగ్గి తెగులు నివారణ చర్యలతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి వరి పొలాన్ని పరిశీలించారు. పంట ఎదుగుదల, పురుగులు, తెగుళ్ల పరిస్థితిని గమనించి రైతులకు పలు సూచనలు చేశారు. కంకి నాలి వల్ల కంకులు, గింజలకు కలిగే నష్టం, ప్రారంభ లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు.

అదేవిధంగా బ్రౌన్ ప్లాంట్ హాపర్ పురుగు మొక్కల అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు ఎండిపోయే అవకాశం ఉందని తెలిపారు. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వినియోగించకుండా, పొలాన్ని తరచూ పరిశీలించాలని సూచించారు.

వరి పంటలో అగ్గి తెగులు లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. అనవసరంగా పురుగుమందులు, శిలీంద్రనాశకాలు వినియోగించకుండా వ్యవసాయ శాఖ సిఫారసుల మేరకే మందులను ఉపయోగించాలని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

పొలం బడి కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను కూడా రైతులకు వివరించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, స్థానికంగా లభించే సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

జీవామృతం, ఘన జీవామృతం, వేప ఆధారిత సహజ ద్రావణాలను పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పంటలో పురుగు, తెగుళ్లను నిరంతరం గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ (ఐపీఎం) పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language