Type Here to Get Search Results !

అప్పాజీపల్లిలో ఘనంగా గణేష్ శోభాయాత్ర.. డీజే పాటలకు యువత నృత్యాలు

 


అప్పాజీపల్లిలో ఘనంగా గణేష్ శోభాయాత్ర

శోభాయాత్రలో నృత్యాలు చేసిన బీఆర్‌ఎస్ యువత విభాగం అధ్యక్షుడు సంతోష్‌రావు

కొల్చారం, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్స్):
కొల్చారం మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామంలో బుధవారం వివిధ గణేష్ మండపాల ఆధ్వర్యంలో గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

అప్పాజీపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ధనరాజ్ పిలుపు మేరకు కొల్చారం మండలం బీఆర్‌ఎస్ యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్‌రావు శోభాయాత్రలో పాల్గొన్నారు. డీజే సంగీతానికి యువతతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శోభాయాత్రలో చిన్నారులు ఆర్మీ దుస్తుల్లో ప్రత్యేక ప్రదర్శన చేయడం ఆకట్టుకుంది. భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో కొల్చారం మండల బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్యామ్, బీఆర్‌ఎస్‌వీ విభాగం అధ్యక్షుడు కొమ్ముల సురేష్ గౌడ్, గోపాల్, నర్సింలు తదితర నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language