Type Here to Get Search Results !

పాపన్నపేటలో ఘనంగా ముగిసిన ఎస్‌జీఎఫ్‌ క్రీడలు.. వాలీబాల్‌, ఖోఖోలో కుర్తివాడ హవా

 పాపన్నపేటలో ఘనంగా ముగిసిన ఎస్‌జీఎఫ్‌ క్రీడలు


వాలీబాల్‌, ఖోఖోలో కుర్తివాడ ఆధిపత్యం.. కబడ్డీలో పాపన్నపేట జోరు


పాపన్నపేట, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):

పాపన్నపేట మండలస్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు గురువారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో విజేతలు, రన్నరప్‌గా నిలిచిన జట్లకు ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు.


వాలీబాల్‌లో కుర్తివాడ హవా:

అండర్‌-17 బాలుర విభాగంలో కుర్తివాడ విజేతగా, పొడ్చన్‌పల్లి రన్నరప్‌గా నిలిచాయి. అండర్‌-14 బాలురలో కుర్తివాడ విజేతగా, కొడ్పాక్‌ రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-14 బాలికల విభాగంలో కుర్తివాడ విజేతగా, కోడుపాక రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-17 బాలికల విభాగంలోనూ కుర్తివాడ జట్టు విజేతగా నిలవగా, లింగాయపల్లి రన్నరప్‌గా నిలిచింది.


ఖోఖోలోనూ కుర్తివాడదే పైచేయి:

ఖోఖో పోటీల్లో కుర్తివాడ జట్లు సత్తా చాటాయి. అండర్‌-17 బాలుర విభాగంలో కుర్తివాడ విజేతగా, లింగాయపల్లి రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-14 బాలికలలో కుర్తివాడ విజేతగా, పొడ్చన్‌పల్లి రన్నరప్‌గా నిలిచాయి. అండర్‌-17 బాలికలలో కుర్తివాడ విజేతగా, సి.లింగాయపల్లి రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-14 బాలుర విభాగంలో కుర్తివాడ విజేతగా, కొత్తపల్లి రన్నరప్‌గా నిలిచింది.


కబడ్డీలో పాపన్నపేట జోరు:

కబడ్డీ పోటీల్లో పాపన్నపేట జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచాయి. అండర్‌-17 బాలుర విభాగంలో పాపన్నపేట విజేతగా, పొడ్చన్‌పల్లి రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-14 బాలురలో సి.లింగాయపల్లి విజేతగా, పాపన్నపేట రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-17 బాలికలలో పాపన్నపేట విజేతగా, లింగాయపల్లి రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-14 బాలికలలో పాపన్నపేట విజేతగా, యూసుఫ్‌పేట రన్నరప్‌గా నిలిచింది.


ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, పాపన్నపేట మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌గౌడ్‌, కుర్తివా



డ సర్పంచ్‌ శ్రీధర్‌, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language