Type Here to Get Search Results !

జాగృతి కళాశాలలో ఘనంగా కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు

 జాగృతి కళాశాలలో ఘనంగా కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు


కాళోజీ ఆశయాలు, రచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం: ప్రిన్సిపల్‌ మల్లేశం


యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్‌ 9 (తెలుగు ట్రెండ్స్‌): ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్‌, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్థానిక జాగృతి డిగ్రీ, పీజీ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ సింగనబోయిన మల్లేశం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.


ముందుగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ జీవిత విశేషాలు, ఆయన సాహిత్య ప్రస్థానం, తెలంగాణ సమాజం కోసం చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు.


ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సింగనబోయిన మల్లేశం మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు జీవితం నేటి యువతకు గొప్ప ఆదర్శమని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను తన రచనల ద్వారా సమాజం ముందుకు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, రచనలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచాయని పేర్కొన్నారు.


“పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అనే కాళోజీ సందేశం ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ హితం కోసం పాటుపడాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాహిత్య పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. మాతృభాషపై గౌరవం పెంచుకోవడంతో పాటు తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని విద్యార్థులకు సూచించారు.


ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు వెంకటేష్‌, ఇస్తారి, సుధా కిషోరీ, అధ్యాపక బృందం, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు


పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language