Type Here to Get Search Results !

పాపన్నపేట మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడిగా ఎండీ. ఖలీం నియామకం.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి

 పాపన్నపేట, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):


పాపన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడిగా ఎండీ. ఖలీంను నియమించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ సోమవారం ఖలీంకు నియామక పత్రాన్ని అందజేశారు.


ఈ సందర్భంగా ఎండీ. ఖలీం మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.


మండలంలోని మైనార్టీ వర్గాల సమస్యలను తెలుసుకుని వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఖలీం తెలిపారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు.


ఖలీం నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్. మల్లప్ప, కే. వెంకటేశ్వర రెడ్డి, ముషెట్టి కిష్టయ్య, పాపన్నపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్, నాని తదితరులు పాల్గొ


న్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language