Type Here to Get Search Results !

మధు కుటుంబానికి అండగా సర్పంచ్ మల్లేశం.. అంత్యక్రియలకు రూ.5 వేల ఆర్థిక సాయం

 


మధు అంత్యక్రియలకు సర్పంచ్ మల్లేశం ఆర్థిక సహాయం

పాపన్నపేట, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రేండ్స్):
పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామానికి చెందిన అవుసుల మధు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రామ సర్పంచ్ ధారబోయిన మల్లేశం దృష్టికి వచ్చింది.

విషయం తెలుసుకున్న సర్పంచ్ మల్లేశం శుక్రవారం మధు కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు, అంత్యక్రియల నిర్వహణకు తన వంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచి సాయం అందించిన సర్పంచ్ మల్లేశానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పలువురు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language