పైతర నర్సింలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఏడుపాయల శ్రీనివాస్‌గౌడ్
పాపన్నపేట, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్): కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న సీనియర్ నాయకులు ఏడుపాయల శ్రీనివాస్‌గౌడ్ మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు.
పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామానికి చెందిన పైతర నర్సింలు మృతి చెందిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌గౌడ్ వెంటనే స్పందించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన శ్రీనివాస్‌గౌడ్, వారి కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తూ శ్రీనివాస్‌గౌడ్ అందిస్తున్న సహాయాన్ని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో సామెల్, చంద్రంగౌడ్, దావిద్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ | పాపన్నపేట
