Type Here to Get Search Results !

పోతారం గ్రామానికి జావు బీవరేజెస్ 35 ఎల్‌ఈడీ లైట్ల విరాళం.. గ్రామాభివృద్ధికి పరిశ్రమల సహకారం

 


పోతారం గ్రామానికి 35 ఎల్‌ఈడీ లైట్ల విరాళం

జావు బీవరేజెస్, ప్రాణా అగ్రో ఫుడ్స్ ఆధ్వర్యంలో పంపిణీ.. గ్రామాభివృద్ధికి సహకరిస్తాం: పబ్బ నందకిషోర్

తూప్రాన్/మనోహరాబాద్, సెప్టెంబర్ 19 (తెలుగు ట్రెండ్స్):
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని జావు బీవరేజెస్ పరిశ్రమ ప్రతినిధి పబ్బ నందకిషోర్ తెలిపారు. మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి జావు బీవరేజెస్, ప్రాణా అగ్రో ఫుడ్స్ సంస్థల ఆధ్వర్యంలో 35 ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధి పబ్బ నందకిషోర్ మాట్లాడుతూ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా (CSR) గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు తమ వంతు సహకారం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

పోతారం గ్రామంలోని ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ 35 ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీధుల్లో వెలుతురు సౌకర్యం మెరుగుపడటంతో ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గడంతో పాటు భద్రతకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎల్‌ఈడీ లైట్లను గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్‌కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా లైట్లను అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

గ్రామాభివృద్ధికి పరిశ్రమలు అందిస్తున్న సహకారాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language