Type Here to Get Search Results !

1977 నుంచి గణపతి సేవ.. 50 ఏళ్లుగా జ్యోతి యోజన సంఘం ఘన ప్రస్థానం

 


ఐదు దశాబ్దాలుగా గణపతి సేవ.. జ్యోతి యోజన సంఘం ఘన ప్రస్థానం

1977 నుంచి నిరంతరాయంగా ఉత్సవాలు.. వ్యవస్థాపక సభ్యులకు ఘన సన్మానం

కులమతాలకు అతీతంగా 50 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: తహసీల్దార్ విజయలక్ష్మి

వెల్దుర్తి , సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటుతూ, ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ ఐదు దశాబ్దాలుగా గణపతి ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న జ్యోతి యోజన సంఘం ప్రస్థానం అభినందనీయమని పలువురు కొనియాడారు. వెల్దుర్తి మండల కేంద్రంలో జ్యోతి యోజన సంఘం ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వెల్దుర్తి తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని సమాజంలో శాంతి, సోదరభావం, సేవా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఐదు దశాబ్దాలుగా గణపతి ఉత్సవాలను కొనసాగిస్తూ గ్రామ ప్రజలను ఏకం చేస్తున్న జ్యోతి యోజన సంఘం సభ్యులను ఆమె అభినందించారు.

కార్యక్రమంలో ఎస్సై కర్ణాకర్ రెడ్డి, ఆర్‌ఐ నర్సింహ యాదవ్, వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

1977లో ప్రారంభమై.. ఐదు దశాబ్దాల ప్రస్థానం

జ్యోతి యోజన సంఘం సభ్యులు మాట్లాడుతూ 1977లో కుల, మతాలకు అతీతంగా సంఘాన్ని ఏర్పాటు చేసి, అప్పటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు.

ఈ సుదీర్ఘ ప్రస్థానంలో సంఘంతో కలిసి పనిచేసిన పలువురు సభ్యులు మృతి చెందారని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను స్మరించుకుంటూ కార్యక్రమంలో మౌనం పాటించి నివాళులర్పించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వ్యవస్థాపక సభ్యులకు ఘన సన్మానం

జ్యోతి యోజన సంఘం ఏర్పాటులో కీలకంగా పనిచేసిన వ్యవస్థాపక సభ్యులు దుర్గాగౌడ్, డాక్టర్ వెంకటయ్య, శేఖాగౌడ్, శంకర్‌గౌడ్, హనుమాద్రి కృష్ణాగౌడ్, అముదా ఆంజనేయులు, కుమ్మరి కిష్టయ్య, ధనరాజ్‌తో పాటు సంఘ అధ్యక్షుడు కిష్టాగౌడ్, కార్యదర్శి చంద్రాగౌడ్‌లను ఘనంగా సన్మానించారు.

వారిని శాలువాలతో సత్కరించి ఐదు దశాబ్దాలుగా ఉత్సవాల నిర్వహణలో అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, గ్రామస్తులు వ్యవస్థాపక సభ్యుల సేవలను కొనియాడారు.

ఆధ్యాత్మికతతో సమాజంలో సానుకూల వాతావరణం

సంఘ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ధర్మం, ఆధ్యాత్మికత, సేవా భావంతో ముందుకు సాగితే సమాజంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

గణపతి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తున్నాయని సంఘ సభ్యులు తెలిపారు.

ఘనంగా అన్నదానం

అనంతరం జ్యోతి యోజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జగ్గ అశోక్ గౌడ్, నాలా చెరువు నరసింహ గౌడ్, రామా గౌడ్ (టీచర్), ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ గుప్తా, రమేష్ చందర్, అంగడిపేట రమేష్, గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి, బాలా గౌడ్, చినింగి కిష్టయ్యతో పాటు జ్యోతి యోజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language