మహిళా పొదుపు, పరపతి సంఘం ఫెడరేషన్ 13వ వార్షిక సర్వసభ్య సమావేశం
అప్పాజీపల్లిలో ఘనంగా నిర్వహణ.. పలువురికి సన్మానం
కొల్చారం, సెప్టెంబర్ 10:
కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో మహిళా పరస్పర సహకార పొదుపు మరియు పరపతి సంఘం ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 13వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సంఘాల కార్యకలాపాలు, సభ్యుల పరస్పర సహకారం, పొదుపు మరియు పరపతి అంశాలపై చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అప్పాజీపల్లి గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ను, గ్రూప్ లీడర్లు కదూరి సుశీల, చలం నగరాణి, చింతల రేణుకలను ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోషిని, వార్డు సభ్యులు, బాధ్యులు సుశీల, మానేపల్లి సావిత్రి, సదాల నర్సింలు, వీవో సీఏ కన్యబోయిన అశోక్తో పాటు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

