Type Here to Get Search Results !

పాపన్నపేట 1104 విద్యుత్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్ ఏకగ్రీవ ఎన్నిక

 



పాపన్నపేట 1104 విద్యుత్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్

పాపన్నపేట, సెప్టెంబర్ 16 (తెలుగు ట్రేండ్స్):
పాపన్నపేట విద్యుత్ సబ్ డివిజన్ 1104 యూనియన్ ఎన్నికలు బుధవారం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్‌లో ఉత్సాహంగా నిర్వహించారు. మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో సబ్ డివిజన్‌కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ సభ్యులు తమ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో పాపన్నపేట విద్యుత్ సబ్ డివిజన్ 1104 యూనియన్ అధ్యక్షులుగా ఎండీ. సమీర్ (ఏఎల్‌ఎం, పాపన్నపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి. రవీందర్ (ఆర్టిజన్, పాపన్నపేట), కార్యదర్శిగా ఆర్. పనిందర్ (ఏఎల్‌ఎం, పెద్దశంకరంపేట), అదనపు కార్యదర్శిగా కే. మోహన్ (ఆర్టిజన్, టేక్మాల్) ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను యూనియన్ నాయకులు, సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని పలువురు సూచించారు.

అలాగే సబ్ డివిజన్ పరిధిలోని ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని జిల్లా స్థాయి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు ఎండీ. సమీర్ తెలిపారు. యూనియన్ సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ సర్కిల్ నాయకులు న్యాత ప్రసాద్, విట్టల్, కామారం శ్రీనివాస్, టేక్మాల్ సంగయ్య, డి. శివరాం నాయక్, రవీందర్ గౌడ్, గంట సుధీర్, ప్రశాంత్, ఎండీ. యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language