మాజీ జడ్పీటీసీ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం
పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కొండల్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
అందోలు, ఆగస్టు 30 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కొండల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాగేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
