Type Here to Get Search Results !

రోడ్డు కోసం బీఆర్‌ఎస్‌ పోరుబాట..! నందగోకుల్‌లో పోటెత్తిన ప్రజలు పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర

 


నందగోకుల్‌లో జనసంద్రం..!

రోడ్డు కోసం గ్రామాల కదం తొక్కిన ప్రజలు

గుంతలు.. దుమ్ము.. బురదతో విసిగిపోయి రోడ్డెక్కిన జనం

రామాయంపేట, ఆగస్టు 29 (నవ పలుకులు):
ఏళ్ల తరబడి రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలు ఇక ఓపిక నశించి ఉద్యమబాట పట్టారు. గుంతలమయమైన రహదారి, ఎండాకాలంలో దుమ్ము ధూళి, వర్షాకాలంలో బురదతో నిత్యం అవస్థలు పడుతున్న ప్రజలు రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ భారీగా రోడ్డెక్కారు. దీంతో నందగోకుల్‌ గ్రామం జనసంద్రంగా మారింది.

నిజాంపేట కమాన్‌–నస్కల్‌–నందగోకుల్‌–చెల్మెడ కమాన్‌ రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నందగోకుల్‌ నుంచి చెల్మెడ కమాన్‌ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మహిళలు, రైతులు, యువతతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.13 కోట్ల నిధులతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత పనులు మధ్యలోనే నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రజలకు ఎంతో కీలకమైన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని మండిపడ్డారు.

అధ్వానంగా మారిన రహదారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. వేసవిలో దుమ్ము, వర్షాకాలంలో బురద కారణంగా వాహనదారులు, రైతులు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇంతకాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

“ప్రజల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? ప్రారంభించిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదు? వెంటనే నిధులు విడుదల చేసి రోడ్డు, బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి. లేకుంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని పద్మా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రోడ్డు నిర్మాణం కోసం గ్రామాల ప్రజలు ఒక్కటై నినాదాలతో పాదయాత్ర చేపట్టడంతో నందగోకుల్‌లో ఉద్యమ వాతావరణం నెలకొంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. నిలిచిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

రోడ్డు కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిలిచిపోయిన రూ.13 కోట్ల రోడ్డు, బ్రిడ్జి పనులు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయోనని ఆయా గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

– నవ పలుకులు రిపోర్టర్‌ బి. యాదగిరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language