Type Here to Get Search Results !

భక్తిశ్రద్ధలతో శ్రీరామ బాణాల శోభాయాత్ర పాపన్నపేటలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఊరేగింపు

 



పాపన్నపేటలో ఘనంగా శ్రీరామ బాణాల ఊరేగింపు

భక్తి భజనల మధ్య శివాలయం వరకు కొనసాగిన శోభాయాత్ర

పాపన్నపేట, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్‌): శ్రావణ మాసం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పాపన్నపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ బాణాల ఊరేగింపు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భక్తి భజనలతో ఉత్సాహంగా సాగింది.

భక్తులు శ్రీరామ నామస్మరణ, భజన పాటలతో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ బాణాలను శివాలయం వరకు తీసుకెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో పాపన్నపేట పద్మశాలి సంఘం చైర్మన్‌ కొడుపాక విఠల్‌, వైస్‌ చైర్మన్‌ పల్లె సంగమేశ్వర్‌, మండల అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్‌, పడిగే కృష్ణ, దాసరి యాదగిరి, కొడుపాక శివశంకర్‌, జూకంటి సంగయ్య, అచ్చుకట్ల గురునాథ్‌, చామంతుల మల్లయ్య, పల్లె లక్ష్మణ్‌, పల్లె రాజు, బద్దాపురం సంగమేశ్వర్‌, తూర్పు రాములు, తూర్పు రాజు, తూర్పు రాము, వళ్ళందేశి శివకుమార్‌, పల్లె రాములు, మదనాల అరవింద్‌, అచ్చుకట్ల మహేష్‌, చామంతుల అరవింద్‌, వళ్ళందేశి మల్లేశం, కొడుపాక ఉమామహేశ్వర్‌, కొడుపాక పూర్ణచందర్‌, రాజారాం చంద్రం, పల్లె ప్రసాద్‌, పడిగే శ్రీకాంత్‌, పల్లె సాయికిరణ్‌, బద్దాపురం రాజు, ఊరటి లక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్‌ – రిపోర్టర్‌: పి. శ్రీనివాస్‌, పాపన్నపేట

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language